Skip to content
యెహోషువ 7:14-18

యెహోషువ 7:14-18

14
“ ‘ఉదయాన్నే గోత్రం వెంబడి గోత్రం మీరు హాజరు కావాలి. అప్పుడు యెహోవా ఎంచుకున్న గోత్రం వంశాలవారిగా ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న వంశం కుటుంబాల ప్రకారం ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న కుటుంబం యొక్క పురుషులు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తారు.
15
శపించబడినవి ఎవరి దగ్గర దొరుకుతుందో వారిని, వారికి చెందిన వారందరిని అగ్నితో నాశనం చేయాలి. వారు యెహోవా ఒడంబడికను మీరి ఇశ్రాయేలులో అవమానకరమైన పని చేశారు!’ ”
16
మరుసటిరోజు తెల్లవారుజామున యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను గోత్రాల ప్రకారం ముందుకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టుబడింది.
17
యూదా వంశాలు ముందుకు వచ్చినప్పుడు జెరహీయులు పట్టుబడ్డారు. అతడు జెరహీయుల వంశాన్ని కుటుంబాల ప్రకారం ముందుకు వచ్చినప్పుడు జబ్ది ఎంపిక చేయబడ్డాడు.
18
యెహోషువ అతని కుటుంబాన్ని ఒక్కొక్కరిగా ముందుకు రప్పించగా, యూదా గోత్రానికి చెందిన జెరహు కుమారుడైన జిమ్రీ, జిమ్రీ కుమారుడైన కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options