యెహోషువ 21:34-39
34
మెరారీయ వంశాలకు (లేవీయులలో మిగిలిన వారు) ఇచ్చారు: జెబూలూను గోత్రం నుండి: యొక్నీము, కర్తా,
35
దిమ్న, నహలాలు వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
36
రూబేను గోత్రం నుండి: బేసెరు, యహజు,
37
కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
38
గాదు గోత్రం నుండి: గిలాదులో ఉన్న రామోతు (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), మహనయీము,
39
హెష్బోను, యాజెరు, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
Settings