యెహోషువ 21:1-8
1
తర్వాత లేవీయుల కుటుంబ పెద్దలు కనానులోని షిలోహులో ఉన్న యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువను ఇశ్రాయేలులోని ఇతర గోత్రాల కుటుంబాల పెద్దలను కలిసి,
2
వారితో కనానులోని షిలోహులో వారితో, “మీరు మా పశువులకు పచ్చికబయళ్లతో పాటు మాకు నివసించడానికి పట్టణాలు ఇవ్వమని మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించారు” అన్నారు.
3
కాబట్టి, యెహోవా ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు తమ సొంత వారసత్వంలో నుండి ఈ క్రింది పట్టణాలను, పచ్చికబయళ్లను లేవీయులకు ఇచ్చారు:
4
కహాతీయులకు వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. యాజకుడైన అహరోను సంతతివారైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.
5
మిగిలిన కహాతు సంతతివారికి ఎఫ్రాయిం, దాను, మనష్షే అర్థ గోత్రాల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు ఇచ్చారు.
6
గెర్షోను సంతతివారికి ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్థ గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.
7
మెరారి సంతతివారికి వారి వంశాల ప్రకారం, రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించారు.
8
యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు లేవీయులకు చీట్ల ద్వారా ఈ పట్టణాలను, వాటి పచ్చికబయళ్లను కేటాయించారు.
Settings