యెహోషువ 19:49-50
49
వారు సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని పంచి ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు వారసత్వాన్ని ఇచ్చారు.
50
వారు యెహోవా ఆజ్ఞను అనుసరించి యెహోషువ అడిగిన ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని తిమ్నాత్ సెరహు అనే ఊరు అతనికిచ్చారు. అతడా ఊరిని కట్టించి అక్కడ నివసించాడు.