Skip to content
యెహోషువ 11:20-23

యెహోషువ 11:20-23

20
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు కనికరం లేకుండా వారిని పూర్తిగా నాశనం చేయాలని, ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచారు.
21
ఆ సమయంలో యెహోషువ వెళ్లి కొండ ప్రాంతంలో అనగా హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా, ఇశ్రాయేలు కొండ ప్రాంతమంతా నివసించిన అనాకీయులందరినీ, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశాడు.
22
ఇశ్రాయేలీయుల భూభాగంలో అనాకీయులు ఎవరూ మిగల్లేదు; గాజా, గాతు, అష్డోదులలో మాత్రమే కొంతమంది మిగిలారు.
23
యెహోవా మోషేకు చెప్పినట్లుగానే యెహోషువ ఆ దేశమంతటిని స్వాధీనం చేసుకుని, ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారసత్వంగా దానిని ఇచ్చాడు. తర్వాత దేశం యుద్ధాలు లేకుండ విశ్రాంతిగా ఉంది.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options