యోవేలు 2:24-29
24
నూర్పిడి కళ్ళాలు ధాన్యంతో నిండి ఉంటాయి, క్రొత్త ద్రాక్షరసం, నూనెతో గానుగ తొట్లు పొర్లిపారుతాయి.
25
“నేను మీ మధ్యకు పంపిన నా గొప్ప సైన్యం పెద్ద మిడతలు, చిన్న మిడతలు, ఇతర మిడతలు, మిడతల గుంపులు తినేసిన సంవత్సరాల పంటను నేను తిరిగి మీకు ఇస్తాను.
26
మీరు కడుపునిండా తిని తృప్తి పొందేవరకు మీకు సమృద్ధి ఉంటుంది, మీ కోసం అద్భుతాలు చేసిన మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు స్తుతిస్తారు; ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.
27
అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నానని, నేను మీ దేవుడైన యెహోవానని, వేరే దేవుడు ఎవరూ లేరని మీరు తెలుసుకుంటారు; ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.
28
“ఆ తర్వాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు.
29
ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను.
Settings