యోబు 9:25-35
25
“పరుగెత్తేవాని కంటే నా రోజులు వేగంగా పరుగెడుతున్నాయి; ఏ సంతోషం లేకుండానే అవి ఎగిరిపోతున్నాయి.
26
రెల్లు పడవలు దాటిపోతున్నట్లు, గ్రద్ద తన ఎరను తన్నుకుపోయినట్లు అవి గడిచిపోతున్నాయి.
27
నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే,
28
నా బాధలన్నిటికి భయపడతాను ఎందుకంటే మీరు నన్ను నిర్దోషిగా ప్రకటించరని నాకు తెలుసు.
29
నేను దోషినని తేలినప్పుడు, నాకెందుకు ఈ వృధా ప్రయాస?
30
సబ్బుతో నన్ను నేను కడుక్కున్నా, శుభ్రం చేసే పొడితో నా చేతులు కడుక్కున్నా,
31
మీరు నన్ను బురద గుంటలో ముంచుతారు, అప్పుడు నా బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.
32
“నేను జవాబివ్వడానికి, ఒకరిపై ఒకరం న్యాయస్థానంలో పోరాడడానికి దేవుడు నాలాంటి మనిషి కాదు.
33
మా మధ్య మధ్యవర్తిత్వం చేసేవారు, మమ్మల్ని కలపగల వారు మాకు లేరు,
34
దేవుని దండాన్ని నా మీద నుండి తీసివేయగలిగిన వారు ఉంటే బాగుండేది, అప్పుడు ఆయన భయం నన్ను ఇక బెదిరించదు.
35
అప్పుడు నిర్భయంగా నేను ఆయనతో మాట్లాడగలను, కాని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అలా చేయలేను.
Settings