యోబు 7:3-5
3
నిరర్థకమైన నెలలు నాకు కేటాయించబడ్డాయి, దుఃఖంతో నిండిన రాత్రులు నాకు నియమించబడ్డాయి.
4
నేను పడుకున్నప్పుడు ‘నేను ఎప్పుడు లేస్తాను రాత్రి ఎప్పుడు ముగుస్తుంది?’ అని ఆలోచిస్తాను తెల్లవారే వరకు నేను అటూ ఇటూ దొర్లుతూ ఉంటాను.
5
నా శరీరం పురుగులతో కురుపులతో కప్పబడింది, నా చర్మం పగిలి చీము పట్టింది.