యోబు 41:4-8
4
జీవితాంతం నీవు దానిని బానిసగా ఉంచుకునేలా అది నీతో ఒప్పందం చేసుకుంటుందా?
5
ఒక పక్షితో ఆడుకున్నట్లు నీవు దానితో ఆడుకుంటావా? నీ ఇంట్లోని అమ్మాయిలు ఆడుకోడానికి దానిని కట్టి ఉంచగలవా?
6
వ్యాపారులు దానితో పరివర్తకం చేస్తారా? వారు దానిని ముక్కలుగా కోసి వ్యాపారులకు అమ్ముతారా?
7
దాని చర్మం నిండా బల్లెములను గుచ్చగలవా? చేపలను పట్టే ఈటెలతో దాని తల నిండా పొడవగలవా?
8
నీవు దాని మీద చేయి వేసి చూడు, దానితో చేసే పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అలా చేయవు.
Settings