Skip to content
యోబు 27:5-12

యోబు 27:5-12

5
మీరు చెప్పేది సరియైనదంటే నేనొప్పుకోను; నేను చనిపోయే వరకు, నా నిజాయితీని విడిచిపెట్టను.
6
నేను నా నిర్దోషత్వాన్ని కొనసాగిస్తాను దానిని ఎప్పటికీ వదలను; నేను బ్రతికిన కాలమంతా నా మనస్సాక్షి నన్ను నిందించదు.
7
“నా శత్రువు దుష్టునిలా, నా విరోధి అన్యాయస్థునిలా ఉండును గాక!
8
భక్తిహీనులు కొట్టివేయబడిన తర్వాత, దేవుడు వారి ప్రాణాలను తీసివేసిన తర్వాత వారికి ఇంకేమి ఆశ ఉంది?
9
వారి మీదికి ఆపద వచ్చినప్పుడు దేవుడు వారి మొర ఆలకిస్తారా?
10
సర్వశక్తిమంతునిలో వారు ఆనందం పొందుతారా? అన్నివేళల్లో వారు దేవునికి మొరపెడతారా?
11
“దేవుని శక్తిని గురించి నేను మీకు ఉపదేశిస్తాను; సర్వశక్తిమంతుని మార్గాలను నేను దాచిపెట్టను.
12
మీరే దానిని చూశారు. అలాంటప్పుడు ఈ అర్థంలేని సంభాషణ ఎందుకు?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options