Skip to content
యోబు 20:22-29

యోబు 20:22-29

22
వారికి సమృద్ధి కలిగినప్పుడు ఇబ్బందిపడతారు; కష్టాల భారం వారి మీద పడుతుంది.
23
వారు తమ కడుపు నింపుకునేప్పుడు, దేవుడు తన కోపాగ్నిని వారి మీద కురిపిస్తారు, వారి మీద కష్టాలను కురిపిస్తారు.
24
ఇనుప ఆయుధం నుండి వారు తప్పించుకున్నా ఇత్తడి విల్లు నుండి బాణం వారి గుండా దూసుకుపోతుంది.
25
దానిని వెనుక నుండి బయటకు తీయగా మెరుస్తున్న ఆ బాణం అంచు వారి కాలేయాన్ని ముక్కలు చేస్తుంది. మరణభయం వారిని కమ్ముకుంటుంది;
26
వారి సంపదలు చీకటిమయం అవుతాయి, ఎవరూ ఊదకుండానే మంటలు రాజుకొని వారిని దహించి వేసి, వారి గుడారాల్లో మిగిలినదంతా నాశనం చేస్తుంది.
27
ఆకాశాలు వారి అపరాధాన్ని బయటపెడతాయి; భూమి వారి మీదికి లేస్తుంది.
28
దేవుని కోపదినాన ప్రవహించే నీటిలో, వారి ఇళ్ళు కొట్టుకుపోతాయి.
29
దుష్టులకు దేవుడు నియమించిన, వారసత్వం ఇదే.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options