యిర్మీయా 9:19-22
19
సీయోను నుండి రోదిస్తున్న శబ్దం వినబడుతుంది: ‘మనం పూర్తిగా పతనం అయ్యాము! మన ఘోరంగా అవమానపరచబడ్డాము! మన ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి మనం మన దేశాన్ని వదిలిపెట్టాలి.’ ”
20
స్త్రీలారా, యెహోవా మాట వినండి; ఆయన నోటి మాటలకు మీ చెవులు తెరవండి. ఏడ్వడం ఎలాగో మీ కుమార్తెలకు నేర్పండి; ఒకరికొకరు ఎలా విలపించాలో బోధించండి.
21
మరణం మన కిటికీల గుండా ఎక్కి మన కోటల్లోకి ప్రవేశించింది; అది వీధుల్లో పిల్లలు లేకుండ బహిరంగ కూడళ్లలో యువకులు లేకుండ నాశనం చేస్తుంది.
22
ఇలా చెప్పు, “యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “ ‘మృతదేహాలు బహిర్భూమిలో పెంటలా, కోత కోసేవాని వెనుక పడి ఉన్న పనల్లా, వాటిని సేకరించడానికి ఎవరూ ఉండరు.’ ”
Settings