Skip to content
యిర్మీయా 48:40-47

తప్పించుకోలేని నాశనం మరియు భవిష్యత్తు నిరీక్షణ

యిర్మీయా 48:40-47
40
యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి! ఒక గ్రద్ద మోయాబు మీద రెక్కలు విప్పుకుని దూసుకుపోతుంది.
41
కెరీయోతు స్వాధీనం చేసుకోబడుతుంది, బలమైన కోటలు వారి స్వాధీనం అవుతాయి. ఆ రోజు మోయాబు యోధుల హృదయాలు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ హృదయంలా ఉంటాయి.
42
మోయాబు యెహోవాను ధిక్కరించింది కాబట్టి ఒక జనాంగంగా ఉండకుండ నాశనమవుతుంది.
43
మోయాబు ప్రజలారా, భయాందోళనలు, గొయ్యి, ఉచ్చు మీ కోసం ఎదురుచూస్తున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
44
“భయాందోళన నుండి పారిపోయేవాడు గొయ్యిలో పడిపోతాడు, గొయ్యిలో నుండి తప్పించుకుని పైకి వచ్చినవాడు ఉచ్చులో చిక్కుకుంటాడు; నేను మోయాబు మీదికి దాన్ని శిక్షించే సంవత్సరాన్ని రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
45
“పారిపోయినవారు హెష్బోను నీడలో బలహీనులై నిలబడి ఉన్నారు, హెష్బోను నుండి అగ్ని, సీహోను మధ్య నుండి మంటలు బయలుదేరాయి. అది మోయాబు నొసళ్లను, అహంకారుల పుర్రెలను కాల్చివేస్తుంది.
46
మోయాబూ, నీకు శ్రమ! కెమోషు ప్రజలు నాశనమైపోయారు; నీ కుమారులు బందీలుగా వెళ్లారు నీ కుమార్తెలు బందీలుగా కొనిపోబడ్డారు.
47
“అయితే నేను రాబోయే రోజుల్లో మోయాబు వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. దీనితో మోయాబుపై తీర్పు ముగిసింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options