యిర్మీయా 34:1-4
1
బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని సైన్యమంతా, అతడు పరిపాలించిన సామ్రాజ్యంలోని అన్ని రాజ్యాలు, జనాంగాలు యెరూషలేముతో పాటు దాని చుట్టుప్రక్కల పట్టణాలన్నిటితో యుద్ధం చేస్తున్నప్పుడు, యెహోవా నుండి యిర్మీయాకు ఈ మాట వచ్చింది:
2
“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: యూదా రాజైన సిద్కియా దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను, అతడు దానిని కాల్చివేస్తాడు.
3
నీవు అతని పట్టు నుండి తప్పించుకోలేవు, ఖచ్చితంగా బంధించబడి అతని చేతులకు అప్పగించబడతావు. నీవు బబులోను రాజును నీ కళ్లతో చూస్తావు, అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నీవు బబులోనుకు వెళ్లిపోతావు.
4
“ ‘అయినప్పటికీ యూదా రాజైన సిద్కియా, యెహోవా నీకు చేసిన వాగ్దానాన్ని విను. నీ గురించి యెహోవా ఇలా అంటున్నారు: నీవు ఖడ్గంతో చంపబడవు;
Settings