యిర్మీయా 19:10-15
10
“నీతో పాటు వచ్చినవారు చూస్తుండగానే ఆ కుండను పగలగొట్టి,
11
వారితో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మరలా బాగుచేయడానికి వీలు లేకుండ ఈ కుమ్మరి కుండను పగలగొట్టినట్లు నేను ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని ధ్వంసం చేస్తాను. తోఫెతులో స్థలం లేకపోయేంతగా అక్కడే చనిపోయినవారిని పాతిపెడతారు.
12
నేను ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసించేవారికి ఇదే చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు. నేను ఈ పట్టణాన్ని తోఫెతులా చేస్తాను.
13
యెరూషలేములోని ఇల్లు, యూదా రాజుల భవనాలు ఆ తోఫెతు స్థలంలా అపవిత్రం చేయబడతాయి. అన్ని ఇళ్ల మీద ప్రజలు ఆకాశ సైన్యాలకు ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించారు.’ ”
14
ప్రవచించడానికి యెహోవా అతన్ని పంపిన తోఫెతు నుండి యిర్మీయా తిరిగివచ్చి యెహోవా ఆలయ ఆవరణంలో నిలబడ్డాడు.
15
“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘వినండి! వారు మెడవంచని వారై నా మాటలు వినలేదు కాబట్టి నేను ఈ పట్టణం మీద దాని చుట్టుప్రక్కల గ్రామాలన్నిటి మీదికి నేను చెప్పిన ప్రతి విపత్తును తీసుకురాబోతున్నాను.’ ”
Settings