యిర్మీయా 17:12-18
12
మన పరిశుద్ధాలయం, ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము.
13
యెహోవా, మీరే ఇశ్రాయేలీయుల నిరీక్షణ; మిమ్మల్ని విడిచిపెట్టేవారందరూ అవమానానికి గురవుతారు. మిమ్మల్ని విడిచిపెట్టినవారి గమ్యం నాశనమే, ఎందుకంటే వారు జీవజలపు ఊటయైన యెహోవాను విడిచిపెట్టారు.
14
యెహోవా, నన్ను స్వస్థపరచండి, నేను స్వస్థపడతాను; నన్ను రక్షించండి, నేను రక్షింపబడతాను, నేను స్తుతించేది మిమ్మల్నే.
15
వారు నాతో ఇలా అంటారు: “యెహోవా మాట ఏమైంది? అది ఇప్పుడు నెరవేరాలి!”
16
నేను మీకు కాపరిగా ఉండకుండ పారిపోలేదు; వారికి నిరాశ దినం రావాలని నేను కోరుకోలేదని మీకు తెలుసు. నా పెదవుల నుండి బయటకు వచ్చే ప్రతీ మాట మీకు తెలుసు.
17
నాకు భయాన్ని కలిగించకండి; ఆపద దినాన మీరే నాకు ఆశ్రయము.
18
నన్ను హింసించేవారు అవమానించబడాలి, కాని అవమానపాలుకాకుండ నన్ను కాపాడండి. వారికి భయభ్రాంతులు కలగాలి, కాని నాకు భయభ్రాంతులు కలుగకుండా కాపాడండి. వారి మీదికి నాశన దినాన్ని రప్పించండి; రెట్టింపు విధ్వంసంతో వారిని నాశనం చేయండి.
Settings