కంటెంట్‌కు వెళ్లండి
యిర్మీయా 14:17-22

యిర్మీయా విలాపము మరియు ప్రజల అంతిమ విజ్ఞప్తి

యిర్మీయా 14:17-22
17
“వారితో ఈ మాట చెప్పు: “ ‘నా కళ్లలో కన్నీరు రాత్రింబగళ్ళు ఆగకుండా పొంగిపారును గాక; ఎందుకంటే, కన్యయైన నా ప్రజల కుమార్తెకు, తీవ్రమైన గాయం తగిలింది, అది ఆమెను నలిపివేస్తుంది.
18
నేను పొలాల్లోకి వెళ్తే, ఖడ్గంతో చంపబడినవారు కనబడతారు; నేను పట్టణంలోకి వెళ్తే, కరువు బీభత్సాన్ని చూస్తాను. ప్రవక్త యాజకుడు ఇద్దరూ తమకు తెలియని దేశానికి వెళ్లారు.’ ”
19
యెహోవా, మీరు యూదాను పూర్తిగా తిరస్కరించారా? మీరు సీయోనును తృణీకరిస్తున్నారా? మేము స్వస్థత పొందలేనంతగా మమ్మల్ని ఎందుకు బాధించారు? మేము సమాధానం కోసం నిరీక్షించాం కానీ ఏ మంచి జరగలేదు, స్వస్థత జరిగే సమయం కోసం నిరీక్షించాం కానీ కేవలం భయమే ఉండింది.
20
యెహోవా, మా దుర్మార్గాన్ని, మా పూర్వికుల అపరాధాన్ని మేము ఒప్పుకుంటున్నాం; మేము మీకు విరోధంగా పాపం చేశాము.
21
మీ పేరు కోసం మమ్మల్ని తృణీకరించకండి; మహిమతో నిండిన మీ సింహాసనాన్ని అగౌరపరచకండి. మాతో మీ ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకోండి దానిని భంగం చేయకండి.
22
జనాంగాల పనికిమాలిన విగ్రహాలేవైనా వర్షాన్ని కురిపిస్తాయా? ఆకాశాలు వాటంతట అవి జల్లులు కురిపిస్తాయా? లేదు, యెహోవా, మా దేవా మీరే కదా. కాబట్టి మీ మీదనే మా నిరీక్షణ ఉంది, ఎందుకంటే ఇదంతా చేసింది మీరే.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options