Skip to content
యెషయా 66:1-6

యెషయా 66:1-6

1
యెహోవా చెప్పే మాట ఇదే: “ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం. మీరు నా కోసం కట్టాలనుకున్న ఇల్లు ఎక్కడ? నా విశ్రాంతి స్థలం ఏది?
2
వీటన్నిటిని చేసింది నా చేయి కాదా, ఈ విధంగా అవి కలిగాయి కదా?” అని యెహోవా తెలియజేస్తున్నారు. “ఎవరైతే వినయంతో పశ్చాత్తాప హృదయం కలిగి నా మాట విని వణుకుతారో, వారికే నేను దయ చూపిస్తాను.
3
అయితే కోడెను బలిచ్చేవారు నరబలి ఇచ్చేవారి వంటివారే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, కుక్క మెడను విరిచేవారి వంటివారే; భోజనార్పణ చేసేవారు పందిరక్తం అర్పించేవారి వంటివారే, జ్ఞాపకార్థ ధూపం వేసేవారు విగ్రహాలను పూజించేవారి వంటివారే. వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు;
4
కాబట్టి నేను వారి కోసం కఠినమైన శిక్షను ఎంచుకుంటాను వారు భయపడేవాటిని వారి మీదికి రప్పిస్తాను. ఎందుకంటే, నేను పిలిస్తే ఎవరూ జవాబు ఇవ్వలేదు నేను మాట్లాడితే ఎవరూ వినలేదు. నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.”
5
యెహోవా మాటకు భయపడేవారలారా, ఆయన మాట వినండి. “మిమ్మల్ని ద్వేషిస్తూ నా నామాన్ని బట్టి మిమ్మల్ని త్రోసివేసే మీ సొంతవారు, ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు మహిమ కలుగును గాక!’ అని అన్నారు. అయినా వారు సిగ్గుపరచబడతారు.
6
పట్టణం నుండి వచ్చే కోలాహలం వినండి మందిరం నుండి వస్తున్న ఆ శబ్దం వినండి! తన శత్రువులకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్న యెహోవా యొక్క శబ్దం అది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options