Skip to content
యెషయా 62:10-12

యెషయా 62:10-12

10
రండి, గుమ్మాల ద్వారా రండి! ప్రజలకు మార్గం సిద్ధపరచండి. నిర్మించండి, రహదారిని నిర్మించండి! రాళ్లను తొలగించండి. దేశాలు చూసేలా జెండాను ఎత్తండి.
11
భూమి అంచుల వరకు యెహోవా చేస్తున్న ప్రకటన: “ ‘ఇదిగో నీ రక్షకుడు వస్తున్నాడు! ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉంది ఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గరే ఉంది’ అని సీయోను కుమార్తెతో చెప్పండి.”
12
వారు పరిశుద్ధ ప్రజలని, యెహోవా విడిపించినవారని పిలువబడతారు; నీవు అందరికి కావలసిన దానివని పాడుబడని పట్టణమని పిలువబడతావు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options