యెషయా 60:15-22
15
“నీవు విడిచిపెట్టబడి, ద్వేషించబడి నీ మార్గంలో ఎవరూ ప్రయాణించకపోయినా, నేను నిన్ను శాశ్వత ఘనతగా అన్ని తరాలకు ఆనందంగా చేస్తాను.
16
నీవు దేశాల పాలు త్రాగుతావు రాజుల చనుపాలు త్రాగుతావు. అప్పుడు నీవు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు యొక్క బలవంతుడైన నీ విమోచకుడని తెలుసుకుంటావు.
17
నేను ఇత్తడికి బదులు బంగారాన్ని ఇనుముకు బదులు వెండిని నీకు తెస్తాను. నేను కర్రకు బదులు ఇత్తడిని రాళ్లకు బదులు ఇనుమును నీకు తెస్తాను. నేను సమాధానాన్ని నీకు అధిపతిగా నీతిని నీకు పాలకునిగా నియమిస్తాను.
18
ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు, నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు. అయితే నీవు నీ గోడలను రక్షణ అని నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు.
19
ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు, చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.
20
నీ సూర్యుడికపై అస్తమించడు. నీ చంద్రుడు క్షీణించడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు, నీ దుఃఖ దినాలు అంతమవుతాయి.
21
అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు; వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నా వైభవం కనుపరచడానికి వారు నేను నాటిన కొమ్మగా నా చేతుల పనిగా ఉంటారు.
22
నీలో చిన్నవాడు వేయిమంది అవుతాడు, కొద్దిగా ఉన్నది బలమైన దేశమవుతుంది. నేను యెహోవాను; సరియైన సమయంలో ఈ పనిని త్వరగా చేస్తాను.”
Settings