యెషయా 60:10-14
10
“విదేశీయులు నీ గోడల్ని మరల కడతారు, వారి రాజులు నీకు సేవ చేస్తారు. నేను కోపంలో నిన్ను కొట్టాను కాని, నేను కరుణించి నీ మీద దయ చూపిస్తాను.
11
నీ దగ్గరకు దేశాల సంపద తీసుకురావడానికి, జయోత్సవంతో వారి రాజులను నడిపించడానికి, నీ ద్వారాలు రాత్రింబగళ్ళు మూసివేయకుండా నిత్యం తెరిచే ఉంటాయి.
12
నిన్ను సేవించని దేశమైనా రాజ్యమైనా నాశనమవుతుంది; అది పూర్తిగా నాశనమవుతుంది.
13
“నా పరిశుద్ధాలయాన్ని అలంకరించడానికి లెబానోను యొక్క వైభవమైన దేవదారు వృక్షాలు, సరళ వృక్షాలు, గొంజిచెట్లు నీ దగ్గరకు తీసుకువస్తారు. నేను నా పాదాలు పెట్టే స్థలాన్ని మహిమపరుస్తాను.
14
నిన్ను బాధించినవారి పిల్లలు నీ ఎదుటకు వచ్చి నమస్కరిస్తారు. నిన్ను తృణీకరించిన వారందరు వచ్చి నీ పాదాల దగ్గర మోకరిస్తారు, యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క సీయోనని వారు నిన్ను పిలుస్తారు.
Settings