Skip to content
యెషయా 3:5-8

యెషయా 3:5-8

5
ప్రజలు ఒకరిని ఒకరు ఒకరి మీదికి ఒకరు, పొరుగువారి మీదికి పొరుగువారు. యువకులు పెద్దవారి మీదికి, అనామకులు ఘనుల మీదికి లేస్తారు.
6
ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుని పట్టుకుని, “నీకు బట్టలు ఉన్నాయి, నీవు మాకు నాయకునిగా ఉండు; ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలోనికి తీసుకో!” అంటాడు.
7
కాని ఆ రోజు అతడు కేక వేసి, “నా దగ్గర పరిష్కారం లేదు. నా ఇంట్లో ఆహారం గాని బట్టలు గాని లేవు; నన్ను ప్రజలకు నాయకునిగా చేయవద్దు” అంటాడు.
8
యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమవుతుంది, వారి మాటలు పనులు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయన మహిమగల సన్నిధిని వారు ధిక్కరించారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options