Skip to content
యెషయా 2:10-22

యెషయా 2:10-22

10
యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి బండ సందులకు వెళ్లి నేలలో దాక్కోండి.
11
మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.
12
సైన్యాల యెహోవా అహంకారం, గర్వం ఉన్న ప్రతివారి కోసం హెచ్చింపబడిన వాటన్నిటి కోసం ఒక రోజును నియమించారు. (అవి అణచివేయబడతాయి),
13
ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి, బాషాను సింధూర వృక్షాలన్నిటికి,
14
పెద్ద పర్వతాలన్నిటికి, ఎత్తైన కొండలన్నిటికి
15
ఉన్నతమైన ప్రతి గోపురానికి ప్రతి కోటగోడకు,
16
ప్రతీ వాణిజ్య నౌకకు మనోహరమైన నౌకలకు ఒక రోజును నియమించారు.
17
మనుష్యుల అహంకారం అణచివేయబడుతుంది మానవుల గర్వం తగ్గించబడుతుంది; ఆ రోజు యెహోవా మాత్రమే ఘనపరచబడతారు.
18
విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి.
19
యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి పారిపోయి వారు కొండల గుహల్లో నేలలో ఉన్న సందుల్లో దాక్కుంటారు.
20
ఆ రోజున మనుష్యులు తాము పూజించడానికి తయారుచేసుకున్న వెండి విగ్రహాలను బంగారు విగ్రహాలను ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు.
21
యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి పారిపోయి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి వారు కొండల గుహల్లో బండ బీటల్లో దాక్కుంటారు.
22
తమ నాసికారంధ్రాలలో ఊపిరి తప్ప ఏమీ లేని నరులను నమ్మడం మానండి. వారిని ఎందుకు లక్ష్యపెట్టాలి?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options