Skip to content
హోషేయ 13:15

హోషేయ 13:15

చుట్టుపక్కల సందర్భంతో వచనం 15 చూపబడుతోంది.
12
ఎఫ్రాయిం అపరాధం పోగుచేయబడింది, అతని పాపాలు వ్రాయబడ్డాయి.
13
ప్రసవ వేదనలాంటి శ్రమ అతనికి కలుగుతుంది, కాన్పు సమయం వచ్చినప్పుడు కాని అతడు జ్ఞానంలేని శిశువుగా ఉన్నాడు; గర్భం నుండి బయటకు రాని శిశువులా అతడు జ్ఞానంలేనివానిగా ఉన్నాడు.
14
“నేను ఈ ప్రజలను పాతాళం శక్తి నుండి విడిపిస్తాను; మరణం నుండి వారిని విమోచిస్తాను. ఓ మరణమా, నీవు కలిగించే తెగుళ్ళు ఎక్కడ? ఓ పాతాళమా, నీవు కలిగించే నాశనం ఎక్కడ? “అతడు తన సోదరుల మధ్య ఎదుగుతున్నా సరే,
15
నేను ఎఫ్రాయిం పట్ల దయ చూపించను. యెహోవా నుండి తూర్పు గాలి వస్తుంది, ఎడారి నుండి అది వీస్తుంది. అతని నీటిబుగ్గ ఎండిపోతుంది అతని బావి ఇంకిపోతుంది. అతని ధననిధులు, ప్రియమైన వస్తువులు దోచుకోబడతాయి.
16
సమరయ ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి, ఎందుకంటే వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు ఖడ్గానికి కూలుతారు; వారి చంటి పిల్లలు నేలకు కొట్టబడతారు, వారి గర్భిణీల కడుపులు చీల్చబడతాయి.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options