Skip to content
హెబ్రీయులకు 3:7-12

హెబ్రీయులకు 3:7-12

7
కాబట్టి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
8
అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినం చేసుకోకండి;
9
అక్కడ నలభై సంవత్సరాలు నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా, మీ పూర్వికులు నన్ను పరీక్షించారు.
10
అందుకే నేను ఆ తరం వారిపై కోప్పడి ఇలా అన్నాను; ‘వారి హృదయాలు ఎల్లప్పుడు దారి తప్పిపోతున్నాయి, వారు నా మార్గాలను తెలుసుకోలేదు’
11
కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”
12
కాబట్టి సహోదరీ సహోదరులారా, జీవంగల దేవుని నుండి దూరంచేసే పాప స్వభావం, అవిశ్వాసపు హృదయం మీలో ఎవరికి ఉండకుండ జాగ్రత్తగా చూసుకోండి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options