Skip to content
ఆదికాండము 19:30-35

ఆదికాండము 19:30-35

30
లోతు, అతని ఇద్దరు కుమార్తెలు సోయరును విడిచి పర్వతాల్లో స్థిరపడ్డారు ఎందుకంటే సోయరులో ఉండడానికి అతడు భయపడ్డాడు. అతడు, అతని కుమార్తెలిద్దరు ఒక గుహలో నివసించారు.
31
ఒక రోజు అతని పెద్దకుమార్తె తన చెల్లెలితో, “మన తండ్రి వృద్ధుడు, ఈ లోకమర్యాద ప్రకారం మనకు పిల్లలను ఇవ్వడానికి ఈ చుట్టుప్రక్కల పురుషులెవ్వరు లేరు.
32
మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి, అతనితో పడుకుని మన తండ్రి ద్వార కుటుంబ వంశావళిని కాపాడదాం” అని అన్నది.
33
ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించారు, పెద్దకుమార్తె అతనితో పడుకుంది. ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు.
34
మర్నాడు పెద్దకుమార్తె తన చెల్లెలితో, “నిన్న రాత్రి తండ్రితో పడుకున్నాను. ఈ రోజు మరలా అతడు ద్రాక్షరసం త్రాగేలా చేద్దాం, నీవు వెళ్లి అతనితో పడుకో, అలా మన తండ్రి ద్వారా మన కుటుంబ వంశావళిని కాపాడదాం” అని అన్నది.
35
ఆ రాత్రి కూడా తమ తండ్రి ద్రాక్షరసం త్రాగేలా చేశారు, చిన్న కుమార్తె అతనితో పడుకుంది. ఈసారి కూడా ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options