Skip to content
ఆదికాండము 16:4-6

ఆదికాండము 16:4-6

4
అతడు హాగరును లైంగికంగా కలిశాడు, ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భవతినని ఆమె తెలుసుకున్నప్పుడు తన యజమానురాలైన శారాయిని చిన్న చూపు చూసింది.
5
అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది.
6
అబ్రాము శారాయితో, “నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఏది మంచిదనిపిస్తే అది తనకు చేయి” అన్నాడు. శారాయి హాగరును వేధించింది కాబట్టి ఆమె శారాయి దగ్గర నుండి పారిపోయింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options