ఎజ్రా 7:14-21
14
నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రం ప్రకారం యూదా గురించి యెరూషలేము గురించి పరిశీలించడానికి రాజు అతని ఏడుగురు సలహాదారులు నిన్ను పంపించారు.
15
అంతేకాక, యెరూషలేములో నివాసం ఉన్న ఇశ్రాయేలు దేవునికి రాజు అతని సలహాదారులు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వెండి బంగారాలను నీతో తీసుకెళ్లాలి.
16
వాటితో పాటు బబులోను ప్రాంతమంతటిలో నీకు లభించిన వెండి బంగారాలను, యెరూషలేములో ఉన్న తమ దేవుని ఆలయానికి ప్రజలు, యాజకులు ఇచ్చిన కానుకలను నీవు తీసుకెళ్లాలి.
17
ఆ డబ్బుతో నీవు బలి అర్పించడానికి కావలసిన ఎడ్లు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు, వాటి భోజనార్పణలు, పానార్పణలతో పాటు కొని, యెరూషలేములోని నీ దేవుని ఆలయ బలిపీఠం మీద వాటిని అర్పించాలి.
18
మిగిలిన వెండి బంగారాలను నీ దేవుని చిత్తప్రకారం నీకు, నీ తోటి ఇశ్రాయేలీయులకు సమ్మతమైన విధంగా వాడండి.
19
నీ దేవుని మందిరంలో ఆరాధన కోసం నీకు అప్పగించిన అన్ని వస్తువులను యెరూషలేములోని దేవుని సన్నిధిలో అందించాలి.
20
నీ దేవుని ఆలయానికి ఇంకా అవసరమైనవి ఏమైనా నీవు కావాలంటే, రాజ ఖజానా నుండి అవి నీకు అందించబడతాయి.
21
రాజునైన అర్తహషస్త అనే నేను, యూఫ్రటీసు నది అవతలి కోశాధికారులకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, పరలోక దేవుని ధర్మశాస్త్ర బోధకుడు, యాజకుడైన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగితే, దానిని శ్రద్ధతో మీరు అందించాలి.
Settings