Skip to content
ఎజ్రా 5:11-15

ఎజ్రా 5:11-15

11
వారు మాకిచ్చిన జవాబు ఇది: “మేము భూమ్యాకాశాల దేవుని సేవకులము. చాలా సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాము.
12
మా పూర్వికులు పరలోక దేవునికి కోపం తెప్పించారు కాబట్టి ఆయన వారిని బబులోను రాజు, కల్దీయుడైన నెబుకద్నెజరు చేతికి అప్పగించారు, అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బందీలుగా బబులోను తీసుకెళ్లాడు.
13
“అయినా, బబులోను రాజైన కోరెషు హయాములో మొదటి సంవత్సరంలో రాజైన కోరెషు ఈ దేవుని మందిరాన్ని మరలా కట్టడానికి శాసనం జారీ చేశాడు.
14
అంతేకాదు గతంలో నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోను క్షేత్రానికి తీసుకెళ్లిన దేవుని మందిరపు వెండి బంగారు వస్తువులను రాజైన కోరెషు బబులోను క్షేత్రంలో నుండి తెప్పించి, తాను అధిపతిగా నియమించిన షేష్బజ్జరుకు వాటిని ఇచ్చి,
15
అతనితో అన్నాడు, ‘నీవు ఈ వస్తువులను తీసుకెళ్లి యెరూషలేములోని మందిరంలో ఉంచాలి. ఆ స్థలంలో దేవుని మందిరాన్ని తిరిగి కట్టించాలి.’
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options