Skip to content
ఎజ్రా 5:11-13

ఎజ్రా 5:11-13

11
వారు మాకిచ్చిన జవాబు ఇది: “మేము భూమ్యాకాశాల దేవుని సేవకులము. చాలా సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాము.
12
మా పూర్వికులు పరలోక దేవునికి కోపం తెప్పించారు కాబట్టి ఆయన వారిని బబులోను రాజు, కల్దీయుడైన నెబుకద్నెజరు చేతికి అప్పగించారు, అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బందీలుగా బబులోను తీసుకెళ్లాడు.
13
“అయినా, బబులోను రాజైన కోరెషు హయాములో మొదటి సంవత్సరంలో రాజైన కోరెషు ఈ దేవుని మందిరాన్ని మరలా కట్టడానికి శాసనం జారీ చేశాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options