ఎజ్రా 5:1-5
1
ప్రవక్తయైన హగ్గయి ఇద్దోకు వారసుడు, ప్రవక్తయైన జెకర్యా యూదాలో, యెరూషలేములో ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రవచించారు.
2
అప్పుడు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ, యెరూషలేములో దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టించడం మొదలుపెట్టారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి మద్ధతు ఇచ్చారు.
3
ఆ సమయంలో యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు వారి దగ్గరకు వెళ్లి, “ఈ మందిరాన్ని మరలా కట్టి దానిని పూర్తి చేయడానికి మీకు ఎవరు అనుమతిచ్చారు?” అని వారిని ప్రశ్నించారు.
4
అంతే కాకుండా, “ఈ భవనాన్ని కడుతున్న వారి పేర్లు ఏమిటి?” అని కూడా అడిగారు.
5
అయితే వారి దేవుని దృష్టి యూదుల పెద్దలను కాపాడుతూ ఉంది కాబట్టి ఈ సమాచారం దర్యావేషుకు చేరి అతని దగ్గర నుండి వ్రాతపూర్వక జవాబు వచ్చేవరకు వారు పని చేయడం ఆపలేదు.
Settings