ప్రారంభ అర్పణలు మరియు నివాస ఏర్పాట్లు
68
వారు యెరూషలేములో యెహోవా ఆలయానికి చేరుకున్నప్పుడు, కుటుంబ పెద్దలలో కొందరు ఆ స్థలంలో దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి స్వేచ్ఛార్పణలు ఇచ్చారు.
69
వారు ఈ పని కోసం తమ శక్తి కొద్ది 61,000 డారిక్కుల బంగారం, 5,000 మీనాల వెండిని, యాజకులకు 100 వస్త్రాలను ఇచ్చారు.
70
యాజకులు, లేవీయులు, సంగీతకారులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు, తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇతర ప్రజల్లో కొంతమంది మిగిలిన ఇశ్రాయేలీయులతో పాటు తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings