యెహెజ్కేలు 7:10-13
10
“ ‘ఇదిగో ఆ రోజు! అది వచ్చేస్తుంది! నాశనం బయలుదేరి వచ్చేసింది దండం వికసించింది. గర్వం చిగురించింది.
11
బలాత్కారం మొదలై దుష్టులను శిక్షించే దండం అయింది. ప్రజల్లో గాని వారి గుంపులో గాని, ఆస్తిలో గాని, వారి ప్రఖ్యాతిలో గాని ఏదీ మిగల్లేదు.
12
ఆ సమయం వచ్చింది! ఆ రోజు వచ్చింది! ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది. కాబట్టి కొనేవాడు సంతోష పడనక్కరలేదు అమ్మే వానికి దుఃఖ పడనక్కరలేదు.
13
అమ్మినవాడు కొన్న వాడు జీవించి ఉన్నంత కాలం అమ్మినవాడు తాను అమ్మిన దానిని తిరిగిపొందడు. ఈ దర్శనం ఆ గుంపు అంతటికి సంబంధించినది అది తప్పక నెరవేరుతుంది. వారి పాపాల కారణంగా వారిలో ఎవరూ తమ ప్రాణాలను రక్షించుకోలేడు.
Settings