యెహెజ్కేలు 43:7
చుట్టుపక్కల సందర్భంతో వచనం 7 చూపబడుతోంది.
4
తూర్పు వైపున ఉన్న గుమ్మం గుండా యెహోవా మహిమ మందిరంలోనికి ప్రవేశించింది.
5
అప్పుడు ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణంలోకి తీసుకువచ్చినప్పుడు, ఆలయమంతా యెహోవా మహిమ నిండిపోయి ఉంది.
6
ఆ వ్యక్తి నా ప్రక్కన నిలబడి ఉండగా, మందిరం లోపలి నుండి ఎవరో నాతో మాట్లాడడం విన్నాను.
7
ఆయన ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఇది నా సింహాసనం, నా పాదాలు పెట్టుకునే స్థలము. ఇక్కడే నేను ఇశ్రాయేలీయుల మధ్య శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు తమ వ్యభిచారం ద్వారా, వారి రాజుల మరణ సమయంలో వారి అంత్యక్రియల అర్పణల ద్వారా నామాన్ని వారు గాని వారి రాజులు గాని అపవిత్రం చేయరు.
8
నాకు వారికి మధ్య గోడ మాత్రమే ఉంచి, వారు నా గుమ్మం ప్రక్కన తమ గుమ్మాలను, నా గడపల ప్రక్కన తమ గడపలను కట్టి, తమ అసహ్యమైన ఆచారాలతో వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, కాబట్టి నేను కోపంతో వారిని నాశనం చేశాను.
9
ఇప్పటికైనా వారు తమ వ్యభిచారాన్ని తమ రాజుల అంత్యక్రియల అర్పణలను నా దగ్గరి నుండి దూరంగా తీసివేసినప్పుడు, నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను.
10
“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాలకు సిగ్గుపడేలా మందిరాన్ని గురించి వారికి వివరించండి. వారు దాని పరిపూర్ణతను పరిగణలోనికి తీసుకుని,
Settings