Skip to content
యెహెజ్కేలు 41:16-26

లోపలి అలంకరణ మరియు సామగ్రి

యెహెజ్కేలు 41:16-26
16
గడపలు, కమ్ములు ఉన్న కిటికీలు మూడు అంతస్తుల చుట్టూ ఉన్న వసారాలను చెక్కతో కప్పి ఉన్న గడపలతో సహా ప్రతిదాన్ని అతడు కొలిచాడు. నేల, కిటికీల వరకు ఉన్న గోడ, కిటికీలు చెక్కతో కప్పబడి ఉన్నాయి.
17
వాకిలికి పై భాగంలో గర్భాలయం బయట, లోపల ఉన్న గోడలు, మందిరం చుట్టూ ఉన్న బయటి గోడలు లోపలి గోడలు కొలత ప్రకారం కట్టి ఉన్నాయి.
18
వాటిపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. రెండు కెరూబుల మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు ఉంది. ప్రతి కెరూబుకు రెండు ముఖాలు ఉన్నాయి.
19
ఒక ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టు వైపు నరుని ముఖం, రెండవ ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టు వైపు సింహ ముఖం ఉన్నాయి. ఆలయమంతా అవి చెక్కి ఉన్నాయి.
20
నేల నుండి వాకిలి పైభాగం వరకు ప్రధాన మందిరపు గోడలపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
21
ప్రధాన మందిరానికి ద్వారబంధం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. అతి పరిశుద్ధ స్థలం ద్వారబంధం కూడా అలాంటిదే.
22
అక్కడ చెక్కతో చేయబడి ఉన్న బలిపీఠం ఎత్తు మూడు మూరలు పొడవు రెండు మూరలు. దాని మూలలు అడుగుభాగం ప్రక్క భాగం కర్రతో చేయబడ్డాయి. “ఇది యెహోవా ఎదుట ఉండే బల్ల” అని అతడు నాతో చెప్పాడు.
23
ప్రధాన మందిరానికి అతి పరిశుద్ధ స్థలానికి రెండు తలుపులు ఉన్నాయి.
24
ప్రతి తలుపుకు మడత బందులు ఉన్న రెండు రెక్కలు ఉన్నాయి.
25
గోడ మీద ఉన్నట్లే ప్రధాన ప్రాంగణం తలుపులపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి మంటపానికి కర్రతో చేసిన పందిరి ఉంది.
26
ఆవరణ ప్రక్క గోడలలో ఇరుకైన కిటికీలు ఉన్నాయి, ప్రతి వైపున ఖర్జూర చెట్లతో చెక్కబడ్డాయి. ఆలయ ప్రక్క గదులకు కూడా కప్పులు ఉండేవి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options