యెహెజ్కేలు 39:11-15
11
“ ‘ఆ రోజున నేను సముద్రానికి తూర్పుగా ప్రయాణికులు వెళ్లే లోయలో ఇశ్రాయేలు దేశంలో గోగును, అల్లరిమూకలను పాతిపెట్టడానికి స్థలం ఇస్తాను. అక్కడ గోగును, అతని అల్లరిమూకలన్ని పాతిపెట్టిన తర్వాత ప్రయాణికులు వెళ్లడానికి వీలుపడదు. ఆ లోయకు హమోన్ గోగు అనే పేరు వస్తుంది.
12
“ ‘దేశాన్ని పవిత్రపరచడానికి ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెడతారు.
13
దేశంలోని ప్రజలందరూ వారిని పాతిపెడతారు, నేను ఘనత పొందిన ఆ రోజు వారికి ఘనత కలుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
14
దేశాన్ని పవిత్రపరచడానికి కొంతమంది మనుష్యులను నియమిస్తారు. వారు ఇతరులతో కలిసి దేశమంతా తిరుగుతూ నేల మీద పడివున్న శవాలను పాతిపెడతారు. “ ‘ఏడు నెల తర్వాత వారు దేశాన్ని పూర్తిగా తనిఖీ చేస్తారు.
15
దేశమంతా తిరుగుతున్నప్పుడు వారిలో ఎవరికైనా మనిషి ఎముక కనబడితే పాతి పెట్టేవారు దానిని తీసుకెళ్లి హమోన్ గోగు లోయలో పాతిపెట్టే వరకు దాని దగ్గర ఒక గుర్తు ఉంచుతారు.
Settings