యెహెజ్కేలు 39:1-8
1
“మనుష్యకుమారుడా, గోగు గురించి ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను.
2
నేను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, దూరంగా ఉన్న ఉత్తర దిక్కునుండి రప్పించి ఇశ్రాయేలు పర్వతాల మీదికి పంపుతాను.
3
అప్పుడు నేను నీ ఎడమచేతి నుండి నీ విల్లు, నీ కుడిచేతి నుండి నీ బాణాలు క్రింద పడేలా చేస్తాను.
4
నీవు నీ సైన్యం నీతో పాటు ఉన్న అనేక జనులు ఇశ్రాయేలు పర్వతాలమీద కూలిపోతారు. వేటాడే రకరకాల క్రూర పక్షులకు, అడవి మృగాలకు నిన్ను ఆహారంగా చేస్తాను.
5
నీవు పొలంలో పడిపోతావు; నేను మాట ఇచ్చాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
6
నేను మాగోగు మీదికి, సముద్ర తీర ప్రాంతాల్లో క్షేమంగా నివసించేవారి మీదికి అగ్ని పంపిస్తాను, అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
7
“ ‘నా పరిశుద్ధ నామాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య వెల్లడి చేస్తాను. ఇకపై నా పరిశుద్ధ నామం అవమానానికి గురి కానివ్వను, అప్పుడు నేనే యెహోవానని ఇశ్రాయేలులో పరిశుద్ధుడనని ఇతర దేశాల ప్రజలు తెలుసుకుంటారు.
8
ఆ సమయం వస్తుంది! అది ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
Settings