Skip to content
యెహెజ్కేలు 13:19-23

యెహెజ్కేలు 13:19-23

19
మీరు గుప్పెడు యవల కోసం రొట్టె ముక్కల కోసం నా ప్రజలమధ్య నన్ను అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్పి, చావకూడని వారిని చంపారు; బ్రతకకూడని వారిని విడిచిపెట్టారు.
20
“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు పక్షులకు వల వేసినట్లు ప్రజల ప్రాణాలకు వల వేయడానికి ఉపయోగించే మీ మంత్రాలకు నేను వ్యతిరేకిని. నేను వాటిని మీ చేతుల నుండి తెంపివేస్తాను; పక్షులను పట్టినట్లు వలవేసి మీరు పట్టిన ప్రజలను విడిపిస్తాను.
21
నేను మీ ముసుగులను చింపివేసి, నా ప్రజలను మీ చేతుల నుండి రక్షిస్తాను, వారు ఇకపై మీ శక్తికి బలి అవరు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
22
ఇదంతా ఎందుకంటే, నేను దుఃఖపరచని నీతిమంతుల హృదయాన్ని అబద్ధాలతో మీరు దుఃఖపెట్టారు. దుర్మార్గులు తమ చెడు మార్గాలు వదిలిపెట్టి తమ ప్రాణాలను కాపాడుకోకుండ మీరు వారిని ప్రోత్సహించారు.
23
కాబట్టి ఇకపై మీరు అబద్ధపు దర్శనాలు చూడరు భవిష్యవాణి చెప్పరు. మీ చేతుల్లో నుండి నా ప్రజలను రక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options