కంటెంట్‌కు వెళ్లండి
నిర్గమకాండము 20:18-21

ప్రజల భయము మరియు విజ్ఞప్తి

నిర్గమకాండము 20:18-21
18
ప్రజలు ఆ ఉరుములు మెరుపులు చూసి బూరధ్వని విని పర్వతం నుండి వస్తున్న పొగను చూసి, వారు భయంతో వణికారు. వారు దూరంగా నిలబడి
19
మోషేతో, “నీవు మాతో మాట్లాడు మేము వింటాము. మాతో దేవుడు నేరుగా మాట్లాడవద్దు లేదా మేము చనిపోతాం” అన్నారు.
20
అందుకు మోషే ప్రజలతో, “భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడు వచ్చారు, తద్వార మీరు పాపం చేయకుండా దేవుని భయం మీలో ఉంటుంది” అని చెప్పాడు.
21
దేవుడున్న ఆ కటికచీకటిని మోషే సమీపిస్తూ ఉండగా ప్రజలు దూరంగా ఉన్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options