Skip to content
నిర్గమకాండము 20:12-17

చివరి ఆరు ఆజ్ఞలు: పొరుగువాని పట్ల కర్తవ్యము

నిర్గమకాండము 20:12-17
12
మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు ఎక్కువకాలం జీవించేలా మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.
13
మీరు హత్య చేయకూడదు.
14
మీరు వ్యభిచారం చేయకూడదు.
15
మీరు దొంగతనం చేయకూడదు.
16
మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు.
17
మీ పొరుగువాని ఇంటిని మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని భార్యను గాని, అతని దాసుని గాని దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options