నిర్గమకాండము 12:14-16
14
“ఈ రోజును మీరు స్మారకోత్సవం జరుపుకోవాలి; ఎందుకంటే రాబోయే తరాలకు దీనిని ఒక నిత్య కట్టుబాటుగా మీరు యెహోవాకు పండుగగా జరుపుకోవాలి.
15
ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి. మొదటి రోజు మీ ఇండ్ల నుండి పులిసిన దాన్ని తీసివేయాలి, ఎందుకంటే మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకు పులిసిన దానితో చేసిన రొట్టెలు ఎవరు తిన్నా, వారు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడాలి.
16
మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, ఏడవ రోజు మరొకటి నిర్వహించాలి. ఈ రోజుల్లో ప్రతిఒక్కరు తినడానికి ఆహారం సిద్ధం చేయడం తప్ప పనులేవీ చేయకూడదు.
Settings