ప్రసంగి 5:6-8
6
నీ మాటలు నిన్ను పాపంలోకి పడవేయకుండా చూసుకో. ఆలయ దూతకు, “పొరపాటున మొక్కుబడి చేశాను” అని చెప్పవద్దు. నీ మాటలకు దేవుడు కోప్పడి నీ చేతిపనిని నాశనం చేయడం అవసరమా?
7
ఎక్కువ కలలు ఎక్కువ మాటలు అర్థరహితమే. కాబట్టి దేవునికి భయపడు.
8
ఒక ప్రాంతంలో పేదలను అణచివేయడం, న్యాయాన్ని హక్కులను పాటించకపోవడం లాంటివి నీవు చూస్తే ఆశ్చర్యపడవద్దు; ఎందుకంటే ఒక అధికారి మీద పైఅధికారులు ఉంటారు, వారందరిపైన ఉన్నతాధికారులు ఉంటారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.