Skip to content
ప్రసంగి 5:10-15

ప్రసంగి 5:10-15

10
డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు; సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పుడూ సంతృప్తి చెందరు. ఇది కూడా అర్థరహితము.
11
ఆస్తి ఎక్కువవుతూ ఉంటే, దాన్ని దోచుకునేవారు కూడా ఎక్కువవుతారు. యజమానులకు తమ ఆస్తిని కళ్లతో చూడడం తప్ప, దానివల్ల వారికేమి ప్రయోజనం?
12
శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా, సుఖంగా నిద్రపోతారు, కానీ ధనికులకున్న సమృద్ధి వారికి నిద్రపట్ట నివ్వదు.
13
సూర్యుని క్రింద బాధాకరమైన ఒక చెడ్డ విషయాన్ని నేను చూశాను: దాచి ఉంచిన సంపద యజమానునికి హాని తెస్తుంది,
14
లేదా దురదృష్టవశాత్తూ వారి సంపద పోతుంది, వారికి పిల్లలు కలిగినప్పుడు వారికి వారసత్వంగా ఏమీ మిగలదు.
15
ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినట్లే దిగంబరిగానే వెళ్లిపోతారు. తాము కష్టపడిన దానిలో నుండి వారు తమ చేతుల్లో ఏమి మోసుకు వెళ్లరు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options