Skip to content
ప్రసంగి 3:1-10

ప్రసంగి 3:1-10

1
ప్రతిదానికీ ఒక సమయం ఉంది, ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది:
2
పుట్టడానికి సమయం చావడానికి సమయం, నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం,
3
చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, పడగొట్టడానికి, కట్టడానికి.
4
ఏడ్వడానికి, నవ్వడానికి దుఃఖపడడానికి, నాట్యమాడడానికి,
5
రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి, కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి.
6
వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం, దాచిపెట్టడానికి, పారవేయడానికి,
7
చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి,
8
ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది.
9
కష్టపడేవారికి తమ కష్టానికి పొందే లాభమేంటి?
10
మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options