Skip to content
ద్వితీయోపదేశకాండము 32:26-33

దేవుని కరుణ, శత్రువు మూర్ఖత్వము

ద్వితీయోపదేశకాండము 32:26-33
26
నేను వారిని చెదరగొడతాను, మానవ జ్ఞాపకంలో నుండి వారి పేరును తుడిచివేస్తాను.
27
కాని వారి శత్రువులు తప్పుగా అర్థం చేసుకుని, ‘ఇదంతా యెహోవా చేసినది కాదు, మా బలంతోనే గెలిచాం’ అని అంటారేమోనని శత్రువుల దూషణకు భయపడి అలా చేయలేదు.”
28
వారు ఆలోచనలేని జనులు, వారిలో వివేచన లేదు.
29
వారు తెలివైన వారైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు, వారి అంతం ఏమిటో వివేచిస్తారు!
30
తమ ఆశ్రయదుర్గం వారిని అప్పగిస్తేనే తప్ప, యెహోవా వారిని వదిలివేస్తేనే తప్ప, ఒక్కడు వేయిమందిని తరుమగలడా? ఇద్దరు పదివేలమందిని పారిపోయేలా చేయగలరా?
31
వారి బండ మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, మన శత్రువులు కూడా ఒప్పుకుంటారు.
32
వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్షచెట్టు నుండి వచ్చింది అది గొమొర్రా పొలాల్లో నుండి వచ్చింది. వాటి ద్రాక్షపండ్లు విషంతో నిండి ఉన్నాయి, వాటి గెలలు చేదుగా ఉన్నాయి.
33
వాటి ద్రాక్షరసం సర్ప విషం, నాగుపాముల మరణకరమైన విషము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options