Skip to content
ద్వితీయోపదేశకాండము 31:3

ద్వితీయోపదేశకాండము 31:3

చుట్టుపక్కల సందర్భంతో వచనం 3 చూపబడుతోంది.
1
మోషే బయటకు వెళ్లి ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్పాడు:
2
“నాకు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు, నేను ఇకపై మిమ్మల్ని నడిపించలేను. ‘నీవు యొర్దాను దాటవు’ అని యెహోవా నాకు చెప్పారు.
3
మీ దేవుడైన యెహోవా స్వయంగా మీకు ముందుగా దాటి వెళ్లి మీ ముందు ఉండకుండ ఈ దేశాలను నాశనం చేస్తారు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా, యెహోషువ కూడా మీకు ముందుగా దాటివెళ్తాడు.
4
అమోరీయుల రాజులైన సీహోను, ఓగులను వారి దేశంతో పాటు నాశనం చేసినట్టుగా, యెహోవా వారికి చేస్తారు.
5
యెహోవా వారిని మీకు అప్పగిస్తారు, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు వారికి చేయాలి.
6
నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. వారికి మీరు భయపడవద్దు దిగులుపడవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో వెళ్తారు; ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలేయరు, మీ చేయి విడువరు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options