కంటెంట్‌కు వెళ్లండి
ద్వితీయోపదేశకాండము 10:12-22

దేవుడు కోరేది: భయభక్తులు, ప్రేమ, న్యాయం

ద్వితీయోపదేశకాండము 10:12-22
12
ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నారు? మీ దేవుడైన యెహోవాయందు మీరు భయం కలిగి ఉండాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయనను ప్రేమించాలని, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడనైన యెహోవాను సేవించాలని,
13
మీ మేలుకోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న యెహోవా ఆజ్ఞలు శాసనాలు పాటించమనే కదా?
14
ఆకాశాలు, మహాకాశాలు, భూమి, భూమిపై ఉన్నవన్నీ మీ దేవుడైన యెహోవాకు చెందినవి.
15
అయితే యెహోవా మీ పూర్వికులపై తన దయ చూపించి, వారిని ప్రేమించి, జనాంగాలందరిలో వారి సంతానమైన మిమ్మల్ని ఈ రోజు వలె ఏర్పరచుకున్నారు.
16
కాబట్టి మీ హృదయాలను సున్నతి చేసుకుని ఇకపై మొండిగా ఉండకండి.
17
ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా దేవుళ్ళకు దేవుడు ప్రభువులకు ప్రభువు, గొప్ప దేవుడు, బలవంతుడు, అద్భుత దేవుడు, పక్షపాతం లేనివారు, లంచం పుచ్చుకోని దేవుడు.
18
తండ్రిలేనివారికి, విధవరాండ్రకు న్యాయం తీరుస్తారు, మీ మధ్యన ఉన్న విదేశీయులను ప్రేమించి వారికి అన్నవస్త్రాలు ఇస్తారు.
19
మీరు కూడ ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి మీరు విదేశీయులను ప్రేమించాలి.
20
మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను సేవించండి. ఆయనను గట్టిగా పట్టుకుని ఆయన పేరిట ప్రమాణాలు చేయండి.
21
మీరు స్తుతించవలసింది ఆయననే; మీ కళ్లారా మీరు చూసిన గొప్ప భయంకరమైన అద్భుతాలను మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.
22
ఈజిప్టుకు వెళ్లినప్పుడు మీ పూర్వికులు మొత్తం డెబ్బైమంది, అయితే ఇప్పుడు మీ దేవుడైన యెహోవా ఆకాశంలోని నక్షత్రాలవలె మిమ్మల్ని అసంఖ్యాకంగా వృద్ధిచేశారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options