Skip to content
దానియేలు 11:1

దానియేలు 11:1

చుట్టుపక్కల సందర్భంతో వచనం 1 చూపబడుతోంది.
1
మాదీయుడైన దర్యావేషు పరిపాలన యొక్క మొదటి సంవత్సరం, నేను అతనికి సహాయం చేయడానికి, బలపరచడానికి నిలబడ్డాను.)
2
“కాబట్టి ఇప్పుడు, నేను నీకు సత్యం చెప్తాను: ఇంకా ముగ్గురు పర్షియా రాజులు వస్తారు, తర్వాత నాలుగవ రాజు వస్తాడు, అతడు ఇతరులందరికంటే ఎంతో ధనవంతుడు. తన ధనం వల్ల బలం పొందుకున్న తర్వాత, అతడు గ్రీసు రాజ్యనికి వ్యతిరేకంగా అందరిని పురికొల్పుతాడు.
3
తర్వాత బలమైన రాజు లేచి, గొప్ప శక్తితో పాలిస్తూ, తన ఇష్టానుసారంగా చేస్తాడు.
4
అతడు పైకి వచ్చిన తర్వాత, అతని సామ్రాజ్యం చీల్చబడి ఆకాశ నలుదిక్కులకు పంచి పెట్టబడుతుంది. అది అతని వారసులకు సంక్రమించదు, లేదా అతడు ఉపయోగించిన అధికారం దానికి ఉండదు ఎందుకంటే, అతని సామ్రాజ్యం పెరికి వేయబడి ఇతరులకు ఇవ్వబడుతుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options