Skip to content
అపొస్తలుల కార్యములు 23:23-31

అపొస్తలుల కార్యములు 23:23-31

23
తర్వాత ఆ అధిపతి తన శతాధిపతులలో ఇద్దరిని పిలిచి, “రెండువందలమంది సైనికులు, డెబ్బైమంది గుర్రపురౌతులను రెండువందలమంది ఈటెల సైన్య పటాలంతో ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరయకు వెళ్లడానికి సిద్ధపడండని ఆదేశించాడు.
24
అలాగే అధిపతియైన ఫెలిక్స్ దగ్గరకు పౌలును క్షేమంగా తీసుకెళ్లడానికి అతనికి గుర్రాన్ని ఇవ్వండి” అని ఆదేశించాడు.
25
అతడు ఈ విధంగా ఒక ఉత్తరం వ్రాశాడు:
26
క్లౌదియ లూసియ, మహా గౌరవనీయులైన ఫెలిక్స్ అధిపతికి, నా వందనాలు.
27
ఈ వ్యక్తిని యూదులు పట్టుకుని చంపబోతుంటే, ఇతడు రోమీయుడని తెలుసుకొని నేను సైనికులతో వెళ్లి రక్షించాను.
28
వారు అతన్ని ఎందుకు నిందిస్తున్నారో తెలుసుకోవడానికి, వారి న్యాయసభ ముందు అతన్ని నిలబెట్టాను.
29
వారు అతనిపై వారి ధర్మశాస్త్రానికి సంబంధించిన నిందలను మోపారు కాని, మరణశిక్ష వేయడానికి లేదా చెరసాలలో ఖైదీగా బంధించడానికి తగిన నేరమేదీ అతనిలో లేదు.
30
అతన్ని చంపాలని కుట్ర పన్నుతున్నారని నాకు తెలియగానే, ఇతన్ని మీ దగ్గరకు పంపాను అతని మీద నిందమోపే వారిని వారి ఫిర్యాదులను మీ ముందు చెప్పుకోవాలి అని ఆదేశించాను.
31
కాబట్టి సైనికులు, తమకు ఇచ్చిన ఆ దేశం ప్రకారం, రాత్రివేళ బయలుదేరి తమతో పౌలును యెరూషలేము నుండి అంతిపత్రి ప్రాంతానికి తీసుకెళ్లారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options