Skip to content
2 సమూయేలు 11:17-27

2 సమూయేలు 11:17-27

17
ఆ పట్టణస్థులు బయటకు వచ్చి యోవాబుతో యుద్ధం చేసినప్పుడు దావీదు సైనికుల్లో కొంతమంది చనిపోయారు. హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.
18
యోవాబు యుద్ధ సమాచారమంతా దావీదుకు పంపించాడు.
19
అతడు ఆ దూతకు ఇచ్చిన ఆదేశమేమిటంటే, “నీవు రాజుకు యుద్ధ సమాచారమంతా చెప్పిన తర్వాత,
20
రాజు కోపం తెచ్చుకుని, ‘యుద్ధం చేయడానికి పట్టణానికి అంత దగ్గరగా మీరెందుకు వెళ్లారు? వారు గోడ పైనుండి బాణాలు వేస్తారని మీకు తెలియదా?
21
యెరుబ్-బెషెతు కుమారుడైన అబీమెలెకును ఎవరు చంపారు? ఒక స్త్రీ గోడ పైనుండి అతనిపై తిరగలి రాయి వేసినందుకు అతడు తేబేసు దగ్గర చనిపోయాడు గదా? మీరు గోడ దగ్గరకు ఎందుకు వెళ్లారు?’ అని అడిగితే నీవు, ‘మీ సేవకుడూ హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పు” అన్నాడు.
22
ఆ దూత వెళ్లి యోవాబు పంపించిన సమాచారమంతా దావీదుకు చెప్పాడు.
23
ఆ దూత దావీదుతో, “ఆ మనుష్యులు మమ్మల్ని తరుముతూ పొలంలో మాపై దాడి చేశారు, కాని మేము వారిని పట్టణపు ద్వారం వరకు తరిమి కొట్టాము.
24
అప్పుడు గోడ పైనుండి విలుకాండ్రు మీ సేవకులపై బాణాలు వేయడంతో రాజు సైనికుల్లో కొంతమంది చనిపోయారు. మీ సేవకుడూ హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు” అన్నాడు.
25
దావీదు ఆ దూతతో, “నీవు యోవాబుతో ఇలా చెప్పు: ‘జరిగినదాన్ని బట్టి నీవు కంగారుపడకు; ఖడ్గం ఒకసారి ఒకరిని మరోసారి ఇంకొకరిని చంపుతుంది. ఆ పట్టణం మీద మీరు ముమ్మరంగా దాడిచేసి దానిని నాశనం చేయండి’ అని చెప్పి యోవాబును ధైర్యపరచు” అన్నాడు.
26
తన భర్త చనిపోయిన సంగతి విని ఊరియా భార్య అతని కోసం దుఃఖించింది.
27
దుఃఖ సమయం ముగిసిన తర్వాత దావీదు ఆమెను తన రాజభవనానికి రప్పించుకున్నాడు. ఆమె అతనికి భార్యయై ఒక కుమారుని కన్నది. అయితే దావీదు చేసిన పని యెహోవా దృష్టికి అసహ్యమైనది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options